పోలింగ్: 28 అక్టోబర్ 2026బుధవారం · ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు
మన రాజన్న గురించి
రైతు బిడ్డ. 30 ఏళ్లుగా రైతునగరం ప్రజల ప్రతి కష్టంలో తోడుగా నిలిచిన మనిషి.
కామిని రాజశేఖర రెడ్డి గారిని రైతునగరంలో అందరూ ప్రేమగా “రాజన్న” అని పిలుస్తారు. పింఛను కావాలన్నా, ఇంటి పట్టా కావాలన్నా, ఆసుపత్రి అవసరమైనా – ఎవరు పిలిచినా అర్ధరాత్రైనా ముందుగా వచ్చేది రాజన్నే.
చిరునవ్వుతో ఎదురొచ్చే, అహంకారం లేని అందరివాడు. ప్రత్యర్థినైనా ఆప్యాయంగా పలకరించే సంస్కారం ఆయనది. చేసిన సాయానికి ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదు – ఫోటోల కోసం కాదు, ప్రజల కోసం పని చేశారు.
2006–2011లో వైయస్ఆర్ గారి హయాంలో కామిని వెంకటేశ్వరమ్మ గారు MPTCగా ప్రజలకు సేవ చేశారు. అదే బాటలో, ఈరోజు జగనన్న నాయకత్వంలో రాజన్న 28వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు.
🏠సుమారు 150 కుటుంబాలకుఇళ్ల పట్టాలు
👵వందకు పైగావృద్ధులు, వితంతువులకు పింఛన్లు
🍚వందలాదిరేషన్ కార్డులు
🛣️ఎన్నోరోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు
🏥ఎంతో మందికిఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సాయం
🌾ఎప్పుడూ ముందుండిసాగునీటి, రైతుల కోసం పోరాటం
రైతునగరం కోసం రాజన్న 5 హామీలు
ప్రజలు చెప్పిన సమస్యల నుంచే ఈ హామీలు – కొత్త కాలనీల రోడ్లు, తాగునీరు, డెంగీ, రద్దయిన పింఛన్లు.
1కొత్త కాలనీల్లో మంచి రోడ్ల కోసం నిరంతర కృషి
2ఇంటింటికీ తాగునీటి సౌకర్యం కోసం కృషి
3డెంగీ రాకుండా – వర్షాకాలానికి ముందే డ్రైనేజీ శుభ్రత, దోమల మందు
4రద్దయిన పింఛన్లు తిరిగి వచ్చే వరకు, అర్హులందరికీ పింఛను వచ్చే వరకు పోరాటం
5ప్రతి నెలా వార్డు సభ – ఫోన్ చేస్తే పలుకుతా
ప్రజల మాటల్లో మన రాజన్న
రైతునగరం ప్రజలు రాజన్న గురించి చెప్పుకునే మాటలు.
పిలిస్తే పలికే మన రాజన్న
చిరునవ్వుతో ఎదురొచ్చే రాజన్న
చిరునవ్వే ఆయన చిరునామా
అహంకారం లేని అందరివాడు
ప్రత్యర్థినైనా చిరునవ్వుతో పలకరించే సంస్కారం
కష్టం వస్తే గుర్తొచ్చే మొదటి పేరు – రాజన్న
మాట ఇస్తే మడమ తిప్పని మనిషి
ఆ రాజన్న ఆశయం.. ఈ రాజన్న ఆచరణ
మాటలు కాదు.. చేతలు!
ఫోటోల కోసం కాదు.. ప్రజల కోసం
30 ఏళ్లు ఆయన మన కోసం.. ఇప్పుడు మనం ఆయన కోసం!
పోస్టర్లు
పోస్టర్‌పై నొక్కితే పెద్దగా కనిపిస్తుంది. డౌన్‌లోడ్ చేసి మీ WhatsApp స్టేటస్‌లో పెట్టండి, మీ వాళ్లకు పంపండి.
సాయంత్రం బీసీ కాలనీ, హనుమాన్ నగర్, రెడ్డీస్ కాలనీ, ఎంప్లాయీస్ కాలనీల్లో రాజన్న ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సూర్యాస్తమయం నుంచి రాత్రి వరకు ప్రతి వీధిలో, ప్రతి గడపకూ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు.
పెద్దలు ఆశీర్వదించారు, అక్కచెల్లెమ్మలు చిరునవ్వుతో స్వాగతం పలికారు. దారిలో ఒక దోసె బండి దగ్గర ఆగి, అక్కడి వారితో కలిసి దోసె వేసి సందడి చేశారు.
18 అక్టోబర్ 2026 · ఉదయం
శివసాయి కాలనీ, శంకరాపురం
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కామిని రాజశేఖర రెడ్డి (మన రాజన్న) ఈరోజు ఉదయం శివసాయి కాలనీ, శంకరాపురం ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రతి గడపకూ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు.
గతంలో వర్షం పడితే రోడ్డు మీది నీళ్లన్నీ కాలనీలోకి వచ్చి ఇళ్ల ముందు నిలిచిపోయేవి. ఆ సమస్యను గుర్తించిన రాజన్న డ్రైనేజీలు మంజూరు చేయించి, దగ్గరుండి నిర్మాణం పూర్తి చేయించారు. ఆ రోజులను గుర్తు చేసుకున్న కాలనీవాసులు రాజన్నకు కృతజ్ఞతలు తెలిపి, ఆత్మీయంగా ఆశీర్వదించారు.
ప్రస్తుతం కాలనీలో ఉన్న సమస్యలను కూడా ప్రజలు రాజన్న దృష్టికి తీసుకొచ్చారు. “ఇప్పటిదాకా ఎలా మీ వెంట ఉన్నానో, ఇకపై కూడా అలాగే ఉంటాను. ప్రతి సమస్య పరిష్కారమయ్యే వరకు కృషి చేస్తాను” అని రాజన్న హామీ ఇచ్చారు.
ఓటు ఎలా వేయాలి?
🗓️28 అక్టోబర్ 2026, బుధవారం
🕖ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు
🪪ఓటరు ఐడి కార్డు లేదా ఆధార్ / ఇతర గుర్తింపు కార్డు తీసుకెళ్లండి
📄ఇది బ్యాలెట్ పేపర్ ఎన్నిక (EVM కాదు)
✅28వ వార్డు బ్యాలెట్‌లో ఫ్యాన్ గుర్తు ఎదుట ముద్ర వేయండి
మన WhatsApp గ్రూప్
QR కోడ్ స్కాన్ చేయండి లేదా క్రింది బటన్ నొక్కండి. రైతునగరం సమాచారం, రాజన్న అప్‌డేట్స్ అన్నీ ఇక్కడే.